SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:51 pm Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల..

–సెప్టెంబర్ 24,25 పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యాలి

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం  పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభల కరపత్రాలును విడుదల చేశారు…

 

ఈ సందర్భంగా పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు మాట్లాడుతూ…..

సెప్టెంబర్ 24,25 తేదీలలో కడప నగరంలో పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని,

ఈ మహాసభలలో గత కార్యక్రమాలను సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి ఉద్యమాలను ఉదృతం చేస్తామని వారు తెలిపారు. విద్యారంగ సమస్యల పైన ,నిరుద్యోగ సమస్యల పైన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి అన్నారు, ఎన్నికల మానిఫెస్టో సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని నిరుద్యోగ యువతకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 ఇస్తామని అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీలు అమలు చెయ్యకుండా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ తీరుపైన వారు అసహనాన్ని వ్యక్తం చేశారు . వలసలకు నిలయమైన రాయలసీమలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ, సమస్యను పరిష్కారం చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఆ హామీని అమలు చెయ్యకుండా గాలికి వదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న లెక్చరర్, ఉపాధ్యాయ, ప్రొఫెసర్స్ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 64000 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు, పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వ వసతి గృహాలలో చదివే విద్యార్థులకు మెస్,కాస్మోటిక్స్ చార్జీలను పెంచాలన్నారు,

పై సమస్యలన్నింటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మహాసభలలలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ పిఆర్ఎస్ వైఎఫ్ పట్టణ నాయకులు అభిలాష్, కృష్ణ, హుస్సేన్, రాజేష్, సూరి, దినేష్, తేజ పాల్గొన్నారు…

.