జీవో-396తో దస్తావేజు లేఖరుల ఉపాధిపై వేటు..! ప్రజల ఆస్తుల భద్రతకూ ముప్పు..రాచమల్లు
–జీవోను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396 దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆస్తుల భద్రత, వ్యక్తిగత సమాచార గోప్యతను కూడా ప్రమాదంలోకి నెడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేపట్టిన...