నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి–ప్రజా సంఘాలు
–సోనమ్ వాంగ్‌చుక్‌పై దాడి, జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ప్రొద్దుటూరులో ప్రజాసంఘాల నిరసన సలాం ప్రొద్దుటూరు: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై జరిగిన దాడిని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలతో జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండించారు....