అస్తానా-ఎ-తాహిర్ షా ఖాద్రీ పీఠాధిపతి కుమారుడు సయ్యద్ సాహెబ్ ఖాద్రీకి ఘన సత్కారం..
–594 మార్కులతో మెరిసిన అదోని విద్యార్థి.. –షైనింగ్ స్టార్ అవార్డుతో రాష్ట్ర స్థాయి గౌరవం సలాం ప్రొద్దుటూరు (అదోని/కర్నూలు): కృషి, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటగలరని అదోనికి చెందిన సయ్యద్ సాహెబ్ ఖాద్రీ మరోసారి నిరూపించారు. అస్తానా-ఎ-తాహిర్ షా ఖాద్రీ పీఠాధిపతి సయ్యద్ నవాజ్ పాషా ఖాద్రీ కుమారుడైన ఆయన, పదో తరగతి ప్రభుత్వ పరీక్షల్లో 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న **"షైనింగ్...