సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం–సీఎం
–డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తాం –దీపం-2.0 లబ్దిదారులకు నిర్థారిత తేదీల్లో నగదు జమ –ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు సలాం ప్రొద్దుటూరు (అమరావతి) : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని... దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం...