SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 1:59 pm Posted by : SALAM PRODDATUR

ఎమ్మెల్యే వరదపై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించాలి.. వై ఎస్ జాబివుల్లా

సలాం ప్రొద్దుటూరు:

ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు రాచమల్లు చేయడం బాధ్యతాయుత రాజకీయాలకు తగదని జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వై ఎస్ జాబివుల్లా పేర్కొన్నారు.. సోమవారం స్థానిక హైదర్ ఖాన్ వీధి లో ఉన్న టిడిపి కార్యాలయం లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  ప్రతి రోజు రాజకీయంగా ఆయన ఉనికి కాపాడుకోవడం కోసం అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు.అసలు రాచమల్లు ఏం మాట్లాడుతున్నారో ఆయన కే తెలియడం లేదన్నారు. గత వ్యాఖ్యలకు నేటి మాటలకు పొంతన లేదనీ వివరించారు.రాచమల్లు గతంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన గురువు బలమైన రాజకీయ నాయకుడు అని అన్నారనీ  ప్రస్తుతం ఆయన వలన  తనకు ఏమి ప్రయోజనం జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించి, సరైన ఆధారాలతోనే మాట్లాడాలని సూచించారు.ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా అసత్య ప్రచారం చేయడం కంటే, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అని పేర్కొన్నారు. విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమైనవే అయినప్పటికీ, అవి వాస్తవాల ఆధారంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు సమాజానికి మంచిది కాదని అన్నారు. ప్రజలు  గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలనీ సూచించారు.వివేకా హత్య పై, నందం సుబ్బయ్య హత్య సంబంధించి రెఫరెండం పెడదామా… సిద్దమా! అని సవాలు విసిరారు