ఇన్‌స్టాగ్రామ్ క్లూతో.. సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నిందితుల అరెస్ట్

సలాం ప్రొద్దుటూరు:   వైఎస్ఆర్  కడప జిల్లా ప్రొద్దుటూరు   రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన బీహారీ యువకుడు మున్నా కుమార్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. హత్య అనంతరం మూడు నెలలుగా పరారీలో ఉన్న బీహార్‌కు చెందిన ఇద్దరు నిందితులు దీపు కుమార్, బిర్జు కుమార్‌లను ఇన్‌స్టాగ్రామ్ క్లూతో పాటు సాంకేతిక ఆధారాల సాయంతో అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) విభూ కృష్ణ, ఐపీఎస్ వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం.. మోడమీదిపల్లె గ్రామంలోని ఓ డెయిరీ ఫారంలో పనిచేస్తున్న...