సలాం ప్రొద్దుటూరు:
విద్యా రంగంలో మరోసారి ప్రతిభను చాటుతూ ప్రొద్దుటూరులోని శారదా జూనియర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘షైనింగ్ స్టార్–2026’ కార్యక్రమంలో కళాశాలకు చెందిన ఓ. ఆయేషా (హెచ్‌ఈసీ), కె. గీతిక (ఎంఈసీ) ఎంపికై విశిష్ట ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా సోమవారం కడపలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఐఏఎస్ విజేతలకు మెడల్, ప్రశంసాపత్రంతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థినులు సాధించిన ఈ విజయం కళాశాలకు మరో మైలురాయిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.విద్యార్థినుల ఈ విజయంపై శారదా జూనియర్ కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. కళాశాల ప్రతినిధులు ఎం. సురేష్ బాబు, ఎం. దుర్గాభవాని, అధ్యాపక బృందం, సిబ్బంది విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి కళాశాలకు, జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.