క్రికెట్ విజేతలకు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

  సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):   పట్టణంలోని విశ్వజ్యోతి హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ పాఠశాల క్రికెట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి   సోమవారం   బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.ఈ పోటీల్లో బీసీ బాలుర హాస్టల్ జట్టు విజేతగా నిలవగా, సెయింట్ మేరీస్ హైస్కూల్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు ట్రోఫీలు, బహుమతులను అందజేసిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో...