SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 1:14 pm Posted by : SALAM PRODDATUR

రోడ్డుపై గుంత.. వినూత్న నిరసన

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో స్థానికులు రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడడంతో అధికారులు ఎంతకు స్పందించకపోవడంతో విన్నూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై పడ్డ గుంత వద్ద బహిరంగంగా బోర్డును ఏర్పాటు చేసి ‘ అధికారులు స్పందించండి ప్లీజ్’ అంటూ లిఖితపూర్వకంగా సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఎన్నిసార్లు కార్పోరేషన్, ఆర్ అండ్ బీ అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.