పుస్తకాల పేరుతో ప్రైవేట్ పాఠశాలల దోపిడీ.. విద్యాశాఖ అధికారులు స్పందించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

     సలాం ప్రొద్దుటూరు  (జమ్మలమడుగు): విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ పాఠశాలలు పాఠ్యపుస్తకాల పేరుతో తల్లిదండ్రులపై వేల రూపాయల ఆర్థిక భారం మోపుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలనే తప్పనిసరిగా...