భూ వివాద ఘటనపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్
సలాం ప్రొద్దుటూరు (బద్వేల్): వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మార్తోమా నగర్‌లో మూడు సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి బద్వేలుకు చెందిన పిన్నం వెంకటయ్య, ప్రొద్దుటూరుకు చెందిన అయ్యవారమ్మ తదితరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూలై 18 సాయంత్రం పిన్నం వెంకటయ్యకు, అయ్యవారమ్మ వద్ద నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పబడుతున్న కడపకు చెందిన బొజ్జా తిరుమలేష్ తదితరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే బద్వేలు టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని...