టీసీఎస్‌లో కొలువులు సాధించిన ఎస్‌వీడీసీ విద్యార్థులను అభినందించిన ఏఎస్పీ విభూ కృష్ణ

– విద్యార్థి రూపొందించిన యాప్‌ను ఆవిష్కరించిన ఏఎస్పీ విభూ కృష్ణ సలాం ప్రొద్దుటూరు: ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో ఉద్యోగాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (ఎస్‌వీడీసీ) విద్యార్థులను ఏఎస్పీ విభూ కృష్ణ సోమవారం అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగాలు సాధించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా వారి విజయానికి దోహదపడిందని అన్నారు.విద్యార్థులు ఇదే పట్టుదలతో తమ వృత్తి జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని...