సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా.. “స్టార్ట్ అప్ కడప”..!!
–జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సలాం ప్రొద్దుటూరు (కడప): సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా జిల్లా యువతను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న "స్టార్ట్ అప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావనతో కలిసి దాదాపు పూర్తి కావచ్చిన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోపు పూర్తి చేసి, వెంటనే అంతర్గత...