SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 9:22 pm Posted by : SALAM PRODDATUR

సోనం  వాంగ్ చుక్,  పోలీసులు అక్రమంగా అరెస్టు  చేయడానికి నిరసిస్తూ సిపిఎం ధర్నా!

సలాం ప్రొద్దుటూరు( చిట్వేల్ ):

 

తిరుపతి జిల్లా  చిట్వేలు మండలంలో, ఢిల్లీలో సోనం   వాంగ్  చుక్   ఆమరణ నిరాహార దీక్ష, భగ్నం చేయడాన్ని, పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా చిట్వేల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి  వందవలస నాగరాజు మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ కింద పనిచేసే ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌ ‌షా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ ‌భగవత్‌ ధర్మేంద్ర ప్రదాన్‌‌ను రక్షించడం కోసం  కొనసాగిస్తున్నారన్నారు. సోనమ్ వాంగ్ చుక్ వద్దకు అనుమతించలేదని,  చర్చలు జరపకుండా, బలవంతంగా  పోలీసుల ద్వారా అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, ధర్మాన ప్రధాన్  నీటి పేపరు లీకేజీ కి ప్రధాన కారకుడు  రాజీనామా చేయాలని, లేకుంటే బర్తరఫ్ చేయాలని, డిమాండ్ చేశారు.సఫ్దర్ జంగ్ ఆసుపత్రి డైరెక్టర్ అనుమతి  తీసుకోకుండా సోనమ్ వాంగ్ చుక్ ను బలవంతంగా  నర్సులు డాక్టర్ రూపంలో, పోలీసులు వచ్చి ఎత్తుకు పోవటాన్ని వ్యతిరేకిస్తూ  చిట్వేల  లో సిపిఎం పార్టీ నిరసన వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు.  శ్రీ జన్ భట్టాచార్య, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అభిజిత్ ఆప్కే, కొనసాగింపుగా చేస్తున్న  నిరవధిక దీక్షలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ నాయకులు, సిహెచ్ చంద్రశేఖర్, పంది   కాళ్ళ మణి, హేమలత, ఓబిలి పెంచలయ్య. మల్లారపు,గురవయ్య, మనోహర్, చిన్న, భాష, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.