బీసీ బాలికల వసతి గృహంలో వైద్య శిబిరం..
– 85 మంది విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని ఏబీఎం (ABM) స్కూల్ సమీపంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల (బీసీ) బాలికల వసతి గృహంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ కటారు మానస పాల్గొని విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలను వివరించి విద్యార్థినుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం సీఓఎంవీ వి. సుబ్బారెడ్డి...