SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:01 pm Posted by : SALAM PRODDATUR

బీసీ బాలికల వసతి గృహంలో వైద్య శిబిరం..

– 85 మంది విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు

సలాం ప్రొద్దుటూరు:

పట్టణంలోని ఏబీఎం (ABM) స్కూల్ సమీపంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల (బీసీ) బాలికల వసతి గృహంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.

 

ఈ శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ కటారు మానస పాల్గొని విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలను వివరించి విద్యార్థినుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

 

అనంతరం సీఓఎంవీ వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ మలేరియా, డెంగీ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఈ వ్యాధులను నివారించవచ్చని సూచించారు.

 

ఈ సందర్భంగా మొత్తం 85 మంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

 

కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి సత్యవతి, ఏఎన్‌ఎం పద్మావతి, ఫార్మసిస్ట్ దినేష్, ఆశా కార్యకర్తలు పుష్పకుమారి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.