SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 3:37 pm Posted by : SALAM PRODDATUR

రీ – నీట్ పరీక్షల ఫలితాల్లో భారీగా అక్రమాలు

 

–విద్యార్థుల ప్రతిభ ను సమాధి చేసిన మోడీ ప్రభుత్వం

 

 

–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం

 

సలాం ప్రొద్దుటూరు:

 

నీట్ – 2026 పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో ఇటీవల జూన్ నెల 21వ తేదీన రీ – నీట్ పరీక్షల ను సవాలుగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాల లో పూర్తిగా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఒక్కొక్కటిగా వెళ్లడవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడపలోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన చాలామంది విద్యార్థులు రీ నీట్ పరీక్షలలో తమకు వచ్చిన మార్కులు పూర్తిస్థాయిలో తేడాగా ఉన్నాయని తీవ్ర మనోవేదనకు గురవుతు న్నారన్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సోనం గవతే అనే విద్యార్థికి ఎన్ టి ఏ విడుదల చేసిన కీ ప్రకారం 522 మార్కులు రావాల్సి ఉండగా, కానీ స్కోర్ కార్డులో కేవలం 95 మార్కులే లభించినట్లు ఫలితాలు వెల్లడయ్యాయ న్నారు. అలాగే వడవనణి పట్టణానికి చెందిన జ్ఞానేశ్వరి పవర్ అనే విద్యార్థి ఎన్టీఏ అప్ లోడ్ చేసిన కీ లో అసలు తన ఓఎంఆర్ షీట్ కాదని సదరు విద్యార్థి తీవ్ర మనోవేదనకు గురవుతున్నార న్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయి ర్యాంకుల స్థానంలో సదరు విద్యార్థికి 702 మార్కులు రావాల్సి ఉండగా, కేవలం 85 మార్కులు మాత్రమే వచ్చినట్లు పరీక్ష ఫలితాల్లో వెల్లడైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని సుమారు 25 మందికి పైగా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు అవినీతి, అక్రమాలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విద్యార్థుల బలిదానాలపై కూడా మోడీ ప్రభుత్వం చలించకపోగా, రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.ఈ విధంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం దాని స్థానంలో రీనీట్ పరీక్షల నిర్వహణ సమయంలో ప్రశ్న పత్రాలను హెలికాప్టర్ల ద్వారా చేరవేసిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫలితాల్లో కూడా భారీ స్థాయిలో కుంభకోణానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వెచ్చించిన విద్యార్థుల తల్లిదండ్రు లను నరేంద్ర మోడీ ప్రభుత్వం యువతను, వారి ప్రతిభను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. గత కొంత కాలం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ పై సామూహిక నిరసన ఆమన నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారన్నారు. విద్యార్థులకు మద్దతుగా ప్రముఖ భారతీయ సైంటిస్టు సోనం వంచుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. కానీ కేంద్రంలోని మత్తవిద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ హింస ప్రజ్వల్లింపజేసే హోం మంత్రి అమిత్ షా విద్యార్థుల డిమాండు పై స్పందించకపోగా ఢిల్లీ పోలీసుల ద్వారా వారిపై దాడి చేయించడం గర్హనీయమన్నారు. మత విద్వేష మత ఫాసిస్టు మోడీ ప్రభుత్వం విద్యార్థుల కు జరిగిన నష్టాన్ని, వారి సమస్యను ఏమాత్రం పట్టించుకోకపోగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వన్ చుక్ ను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఢిల్లీ పోలీసులు దీక్ష చేస్తున్న విద్యార్థులు, వారి నాయకులపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ భవిత ను నాశనం చేస్తోందన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీ లన్ని విద్యార్థుల పోరాటానికి ఇదివరకే మద్దతు తెలిపినట్లు స్పష్టం చేశారు. నీకు పరీక్షల కోసం విద్యార్థులు సంవత్సరాల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివిన శ్రమను మోడీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, కుంభకోణం ద్వారా ధ్వంసం చేస్తోందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ మాత్రమే కాకుండా అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలు చేయడం, సమర్థవంతంగా పరీక్షలను నిర్వహించకపోవడంతో విద్యార్థుల జీవితం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ విద్యార్థుల ప్రతిభను అవినీతి, ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణాల ద్వారా మోడీ, అమిత్ షా సమాధి చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని తల్లిదండ్రులు అప్పులు కూడా చేసి వారిని చదివిస్తున్నారన్నారు. కేంద్రం లోని ఎన్ డి ఏ ప్రభుత్వంలో భాగస్వామ్యైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి ప్రభుత్వానికి మద్దతిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా యువతను మోసం చేస్తున్నారన్నారు. విద్యార్థుల ప్రతిభతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ యువత సమాధి కడుతుందని హెచ్చరించారు.