ఉదయాన్నే మద్యం దుకాణాలు తెరిచి అధిక ధరలకు విక్రయాలు..
–అధికారుల నిర్లక్ష్యంపై ఐద్వా ఆగ్రహం సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామునే మద్యం, బార్ దుకాణాలు తెరిచి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా (AIDWA) నాయకులు ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐద్వా పట్టణ కార్యదర్శి జి. ప్రేమ, అధ్యక్షురాలు వై. విజయమ్మ మాట్లాడుతూ, ఉదయం 11 గంటలకు తెరవాల్సిన బ్రాందీ షాపులు తెల్లవారుజామునే 5–6 గంటల నుంచే కార్యకలాపాలు ప్రారంభించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాయని...