రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘మన రాయలసీమ’ 4వ బులిటెన్ పుస్తకావిష్కరణ

సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో 'మన రాయలసీమ' 4వ బులిటెన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (RCP) రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి, ప్రాంతీయ సమస్యల పరిష్కారం, ప్రజల్లో చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి బులిటెన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రాయలసీమకు సంబంధించిన చారిత్రక, సామాజిక, ఆర్థిక అంశాలను ప్రజలకు చేరవేయడంలో రచయితలు, మేధావులు...