గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్..
–4 కిలోల గంజాయి, రూ.3 వేల నగదు స్వాధీనం సలాం ప్రొద్దుటూరు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రొద్దుటూరు III టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 కిలోల గంజాయి, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి గుడికి ఉత్తర వైపున ఉన్న కాలువకట్ట సమీపంలో శనివారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది....