బల్క్ వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ అందరి బాధ్యత: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యుగంధర్

కడప (వైఎస్ఆర్ జిల్లా), జూలై 18: 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 'బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ మరియు నమోదు'పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు "బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల గుర్తింపు మరియు నమోదు" నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ యుగంధర్ తెలిపారు. ఇకపై నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో ఎక్కువ మొత్తంలో విడుదలయ్యే...