-ప్రజలకు పార్టీ సేవలను మరింత చేరువ చేసే వేదిక: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ను శనివారం ప్రొద్దుటూరులోని దొరసానిపల్లెలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన స్వగృహంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరియు ప్రజలకు అవసరమైన సమాచారం, పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ అంశాలు, ప్రజా సమస్యల నమోదు
వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడమే జగన్ 2.0 సూపర్ యాప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తలందరూ జగన్ 2.0 సూపర్ యాప్ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని విస్తృతంగా వినియోగించాలని, ప్రజలకు కూడా దీని గురించి అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కోసం యాప్ ఉపయోగపడుతుందన్నారు. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కృషి చేస్తారన్నారు. ప్రస్తుతం భావ స్వేచ్ఛ ప్రకటన చేయడానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితి ఉందన్నారు. సోషల్ మీడియాను గొంతు నలిపే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యాప్ ను జగన్ ప్రవేశపెట్టారని దీంతో వైఎస్ఆర్ పార్టీ కి మరింత బలం చేపడుతుందన్నారు. యాప్ ద్వారా ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగిన అధికారులు నిర్లక్ష్యం చేసిన, ప్రజా సమస్యలు ప్రతి విషయం వైయస్ జగన్ చేరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.