దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్

    –విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఆరా    సలాం  ప్రొద్దుటూరు: కడప జిల్లాలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం మధ్యాహ్నం ప్రొద్టుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. ముందుగా పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల అందజేత, వాటి నాణ్యత గురించి విద్యార్థులను...