ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం –మంత్రి లోకేష్
సలాం ప్రొద్దుటూరు: వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలే. ఎంతచేసినా వారి రుణం తీర్చుకోలేం అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు . ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా తన పై కోడిగుడ్లతో దాడిచేసి, భయపెట్టాలని చూశారన్నారు. జి.ఓ. నెం.1 పేరుతో పాదయాత్రను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కడప జిల్లా మధ్యలో రెండు ఎన్నికల్లో ఇబ్బందిపడినా గత ఎన్నికల్లో మళ్లీ పార్టీకి గతవైభవం తెచ్చారనీ...