SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 8:53 am Posted by : SALAM PRODDATUR

ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం –మంత్రి లోకేష్ 

 

సలాం ప్రొద్దుటూరు:

వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలే. ఎంతచేసినా వారి రుణం తీర్చుకోలేం అని మంత్రి   నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు .   ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా తన పై కోడిగుడ్లతో దాడిచేసి, భయపెట్టాలని చూశారన్నారు. జి.ఓ. నెం.1 పేరుతో పాదయాత్రను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కడప జిల్లా మధ్యలో రెండు ఎన్నికల్లో ఇబ్బందిపడినా గత ఎన్నికల్లో మళ్లీ పార్టీకి గతవైభవం తెచ్చారనీ కొనియాడారు. అధికారంలోకి వచ్చామని కష్టకాలాన్ని మర్చిపోకూడదన్నారు. తాను పాదయాత్ర బుక్ చూసినపుడు ఆనాటి స్మృతులన్నీ గుర్తుకువస్తుంటాయన్నారు. మినీ ముంబాయిగా పేరొందిన ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఇటీవల జొన్నగిరి గోల్డ్ మైన్ ను ప్రారంభించిన చంద్రబాబు  రాయలసీమను గోల్డ్ హబ్ గా మార్చేందుకు కృషిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రొద్దుటూరులో నాలుగుసార్లు టిడిపి గెలిచిందనీ హర్షం వ్యక్తం చేశారు.

.