SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 12:02 am Posted by : SALAM PRODDATUR

లోకేష్‌ను కలిసిన ఆసం రఘురామిరెడ్డి

 

 

సలాం ప్రొద్దుటూరు  (కడప):

కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి కడప విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్భంగా ఆసం రఘురామిరెడ్డి నారా లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రొద్దుటూరు లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై స్వల్పంగా చర్చించారు .జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.