మైనర్ బాలిక అపహరణ కేసు ఛేదన.. పోక్సో కేసులో యువకుడి అరెస్ట్
–ఏఐ కెమెరాలు, 360 సీసీ కెమెరా నెట్‌వర్క్ సాయంతో నిందితుడి ఆచూకీ గుర్తించిన ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు సలాం ప్రొద్దుటూరు: మైనర్ బాలిక అదృశ్యమైన కేసును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించిన ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు. 360 సీసీ కెమెరా నెట్‌వర్క్, ఏఐ కెమెరాల డేటా విశ్లేషణతో నిందితుడి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు మండలం అమృతానగర్‌కు చెందిన 14...