SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 2:02 am Posted by : SALAM PRODDATUR

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

 

 

సలాం ప్రొద్దుటూరు (  హైదరాబాద్):

 

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1953లో తూ.గో జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆ తరువాత అనేక సవాళ్లు చేసి.. తన పేరును కూడా మార్చుకొని సంచలనం సృష్టించారు.