మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యకు ఆత్మీయంగా పలకరించిన లోకేష్

    సలాం ప్రొద్దుటూరు   (కడప ): కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ను మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.   ఈ సందర్భంగా లోకేష్ ఆప్యాయంగా పలకరించగా, బచ్చల పుల్లయ్య పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిణామాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది.