మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నేత మెట్టుపల్లి రామచంద్రారెడ్డి
సలాం ప్రొద్దుటూరు (కడప): కడప జిల్లా పర్యటన సందర్భంగా కడప విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ సీనియర్ నాయకులు మెట్టుపల్లి రామచంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ...