SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 11:47 am Posted by : SALAM PRODDATUR

దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు భూమిపూజ చేసిన మంత్రి నారా లోకేష్

సలాం ప్రొద్దుటూరు:

కడప జిల్లా అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర ఐటీ మంత్రి  నారా లోకేష్ దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు.

 

ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ విస్తరణ ప్రాజెక్టు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.