జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం
–సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారధి సలాం ప్రొద్దుటూరు (విజయవాడ): జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, పెన్షన్, హైపవవర్ కమిటీ, మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుతో పాటు ఇతర జర్నలిస్టుల సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారధి హామీ యిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) ప్రతినిధివర్గం ఈరోజు సచివాలయంలో మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి4న విజయవాడలో జరిగిన జర్నలిస్టుల మహాప్రదర్శనలో మంత్రి ఇచ్చిన హామీలను గుర్తు...