ఓటర్ల నమోదు, ప్రత్యేక సవరణ గడువు జూలై 24 వరకు పొడిగింపు– బీజేపీ
సలాం ప్రొద్దుటూరు: ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమం గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కడప జిల్లా అధికార ప్రతినిధి పర్లపాడు గౌరీశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు...