లోకేష్‌ను కలిసిన భూమిరెడ్డి సూర్య ప్రతాప్ 

సలాం ప్రొద్దుటూరు (కడప): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ ను భూమిరెడ్డి సూర్య ప్రతాప్    మర్యాదపూర్వకంగా  కలిశారు. కడప విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు. అనంతరం భూమిరెడ్డి సూర్య ప్రతాప్  లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.