అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలి– జిల్లా కలెక్టర్

  సలాం ప్రొద్దుటూరు  (కడప): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని...