అబద్ధపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు.. ఎమ్మెల్యే
–అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం... సలాం ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అని అవి ఏమాత్రం ఫలించవని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. గత ఎన్నికల్లో...