SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 1:26 pm Posted by : SALAM PRODDATUR

పాత మార్కెట్ లోని  పోతురాజు గడ్డను పరిరక్షించాలి

– దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతిపత్రం

 

 సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరులో నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవాలయాన్ని గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించిన సందర్భంగా, పాత మార్కెట్ ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న చారిత్రక పోతురాజు గడ్డ అన్యాక్రాంతమైన సమస్యపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో శివశక్తి జిల్లా అధ్యక్షులు  పుల్లారెడ్డి, ప్రొద్దుటూరు అధ్యక్షుడు  ప్రశాంత్, బీజేపీ ప్రొద్దుటూరు అధ్యక్షులు  వంకదరా నరేంద్రరావు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  నంద్యాల వరదరాజు రెడ్డి  సమక్షంలో వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రంలో, పోతురాజు గడ్డ ప్రొద్దుటూరు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, స్థానిక సంప్రదాయాలకు ప్రతీకగా ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోందని వివరించారు. వర్షాలు ఆలస్యమైనప్పుడు ప్రజలు తమ ఇళ్ల నుంచి కుండలలో నీటిని తీసుకువచ్చి పోతురాజు గడ్డపై అభిషేకం చేసి, సమృద్ధిగా వర్షాలు కురవాలని మొక్కుకునే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు.