SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 6:52 pm Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శివప్రసాద్

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖ అధికారిగా   జి ఎల్ వి ఎస్ శివ ప్రసాద్    ఫుల్ ఆడిషనల్ చార్జ్ గా బాధ్యతలు బుధవారం స్వీకరించారు. ఈయన గతంలో ప్రొద్దుటూరు మండల విద్యాశాఖ అధికారిగా, శ్రీ ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. ప్రస్తుతం ఎర్రగుంట్ల మండల విద్యాశాఖ అధికారిగా పనిచేయుచున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు , ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం  ఉప విద్యాశాఖ అధికారి ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప విద్యాశాఖ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్ ప్రభుత్వ పాఠశాలలను జిల్లాలో అగ్రస్థానం లో నిలపడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పట్ల తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను క్షేత్రస్థాయిలో ప్రతి ఉపాధ్యాయునికి చేరవేసేలా చొరవ తీసుకుంటానని తెలియజేశారు.