SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 10:11 pm Posted by : SALAM PRODDATUR

నూతన సాంఘిక సంక్షేమ శాఖ డిడి చింతామణి ను శుభాకాంక్షలు తెలిపిన ఎ ఐ బి ఎస్ యు నాయకులు

 

సలాం ప్రొద్దుటూరు ( కడప):

 

బుధవారం కడప కలెక్టరేట్ లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం లో సాంఘిక సంక్షేమ శాఖ నూతనంగా డిడి గా బాధ్యతలు చేపట్టిన చింతామణి ను ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ యూనియన్ (AIBSU ) రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో ఈ జిల్లాలో పని చేసి ఉండడం వల్ల, జిల్లా పరిస్థితులు బాగా తెలుసు కాబట్టి ఈ జిల్లాలో లోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ఈ ప్రాంతం లో చాలా హాస్టల్స్ అద్దె భవనాళ్లలో వున్నాయని, అదేవిధంగా జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో వున్నా విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిస్కారానికి కృషి చేయాలని కోరారు.