–డిప్లొమా, బి.టెక్ పూర్తి చేసిన వారికి అవకాశం
– జూలై 3న అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్వ్యూలు
సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియాలో NAPS అప్రెంటిస్ (ప్రొడక్షన్) పోస్టుల భర్తీకి భారీ వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీ.వి. ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ నియామకాలకు 2022 నుంచి 2026 మధ్య డిప్లొమా లేదా బి.టెక్ (అన్ని బ్రాంచులు) పూర్తి చేసిన, 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు.ఎంపికైన అభ్యర్థులకు అసెంబ్లీ, బాడీ, పెయింట్, ఇంజిన్, ప్రొడక్షన్ కంట్రోల్, క్వాలిటీ విభాగాల్లో శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. సంస్థ తరఫున ఉచిత భోజనం, ఏసీ బస్సు రవాణా, ఇన్సూరెన్స్, ₹15 లక్షల GPA, ₹1 లక్ష GMC, WC పాలసీతో పాటు రెండేళ్ల NAPS ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేయనున్నట్లు వెల్లడించారు.మొదటి సంవత్సరంలో నెలకు ₹18,000 స్టైపెండ్‌తో పాటు ₹2,000 హాజరు బోనస్, రెండో సంవత్సరంలో ₹18,750 స్టైపెండ్‌తో పాటు ₹2,250 హాజరు బోనస్ లభిస్తాయని తెలిపారు. రెండేళ్ల మొత్తం ప్యాకేజీ విలువ ₹5.14 లక్షలు కాగా, మొదటి సంవత్సరం పూర్తయ్యాక ₹10,000, రెండో సంవత్సరం పూర్తయ్యాక ₹12,000 రిటెన్షన్ బోనస్ కూడా అందజేయనున్నట్లు వివరించారు.అర్హత గల యువతీయువకులు ఆధార్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటా, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7658902296 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.