SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:36 pm Posted by : SALAM PRODDATUR

ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ చైర్మన్ గా సివి సురేష్  

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యులు సివి సురేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సివి సురేష్ పొద్దుటూరు కు చెందిన ప్రముఖ న్యాయవాది ,మాజీ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ,ఆర్యవైశ్య సభ కమిటీ మెంబర్ . రాష్ట్ర ఆర్యవైశ్య సభ లీగల్ సెల్ చైర్మన్ గా  ఎన్నికైన     సందర్భంగా  సివి సురేష్ మాట్లాడారు .రాష్ట్ర మహా ఆర్యవైశ్య సభ తన మీద పెట్టిన ఈ బాధ్యతను తన వంతు కర్తవ్యంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు.   ఆర్యవైశ్యుల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఆర్యవైశ మహా సభ అధ్యశులు ఇల్లూరు లక్ష్మయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు ధన్యవాదాలు తెలిపారు, ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య సభ్యులు ప్రముఖులు సివి సురేష్ ను అభినందించారు.