మిషన్ లైఫ్-2026’లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు
సలాం ప్రొద్దుటూరు (కలికిరి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్-2026' కార్యక్రమంలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా, కలికిరి ఇందిరమ్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (టి. చదివేవాండ్లపల్లి) 9వ తరగతి విద్యార్థులు కలికిరి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ డాక్టర్ కె. మంజుల విద్యార్థులకు కేంద్రం ద్వారా రైతులు, మహిళలు, గ్రామీణ యువతకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, సేంద్రీయ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయ...