సలాం ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మంగళవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మున్సిపల్ అధికారులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వి. సుబ్బరాయుడు, రెవెన్యూ ఆఫీసర్ మధుసూదన బాబు, వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసిన అవ్వారు శివయ్య, పబ్లిక్ హెల్త్ వర్కర్ మంచాల ప్రతాప్లను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ సి. రవి చంద్రారెడ్డి గారు, మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులు గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎం. మంజునాథ్ గౌడ్ గారు పాల్గొని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు తమ సుదీర్ఘ సేవాకాలంలో పురపాలక సంఘ అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను ప్రశంసిస్తూ, పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.