SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 6:18 pm Posted by : SALAM PRODDATUR

పదవీ విరమణ పొందిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ ను సన్మానం చేసిన కమిషనర్ 

 

సలాం ప్రొద్దుటూరు:

మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ వి సుబ్బరాయుడు పదవీ విరమణ సందర్భంగా మున్సిపల్ అధికారులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు ను పురపాలక కమిషనర్ సి. రవిచంద్రారెడ్డి సన్మానించారు. సుబ్బరాయుడు చేసిన సేవల కు అభినందించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ , శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నూర్ బాషా , శ్రీనివాసుల రెడ్డి , వార్డు శానిటేషన్ సెక్రటరీలు పాల్గొని, పదవీ విరమణ పొందిన ఉద్యోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలు, ఆనందాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.