SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 10:49 pm Posted by : SALAM PRODDATUR

వద్దిరాల ధన్నవాడ మధ్యలో ఘోర ప్రమాదం

సలాం ప్రొద్దుటూరు (మైలవరం ):

మైలవరం మండలం వద్దిరాల ధన్నవాడ మధ్యలో ఘోర ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది.పోరుమామిళ్ల దగ్గర వాసుదేవపురంనకు చెందిన ఐచర్ డ్రైవర్ బళ్లారి దగ్గర రాజమండ్రి కి మొక్కలను తీసుకువెళ్లారు. తిరుగు ప్రయాణంలో డ్రైవర్ శ్రావణ్ మూడు రోజుల నుంచి నిద్ర లేక నిద్ర మత్తులో సిమెంట్ ట్యాంకను ఢీకొట్టడం జరిగింది. డ్రైవర్ శ్రావణ్ మృతి. ఐచర్ లో ఇరుక్కున్న డ్రైవర్ని జెసిబి సహాయంతో బయటకి వెలికి తీశారు.ఈ ఘటనలో క్లీన ర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని, ఐచర్ క్లీనర్ను అంబులెన్స్ కు ఫోన్ చేసి హాస్పిటల్ కి పంపించారు. క్లీనర్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని విశ్వసినీయ సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలిసిన వెంటనే రూరల్ సీఐ కులయప్ప, మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్ రెడ్డి, తలమంచి పట్నం ఎస్సై హైమావతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.