SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 4:19 pm Posted by : SALAM PRODDATUR

“మీ ఓటు – మా బాధ్యత” నినాదంతో ఇర్ఫాన్ భాష

 

–SIR హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష

–ప్రజల సహాయార్థం నూతన వెబ్‌సైట్ WWW.CHECKSIR.COM ఆవిష్కరణ

–హెల్ప్‌లైన్ నంబర్: 7899001300

–SIR ఫారమ్‌లు నింపడంలో సహాయం అవసరమైన వారు ప్రొద్దుటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు

 

సలాం ప్రొద్దుటూరు :

 

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష ఆధ్వర్యంలో ప్రత్యేక SIR హెల్ప్ డెస్క్ సోమవారం ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు WWW.CHECKSIR.COM వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రజలు వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అలాగే SIR ప్రక్రియకు సంబంధించిన ఫారమ్‌లను నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.SIR ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని ఇర్ఫాన్ భాష పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రజలు SIR ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.