– DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్.
సలాం ప్రొద్దుటూరు (కడప):
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్ కేంద్రాల పై తనిఖీలు నిర్వహించడంలో,చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రొద్దుటూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతా పై చర్యలు తీసుకోవాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేసారు.సోమవారం DYFI ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు డీఆర్వో మల్లికార్జున కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ జిల్లా అంతట ఆర్ఎంపీ క్లినిక్ ల పై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని నిబంధనలు పాటించని వాటి పై చర్యలు చేపడుతున్నారని కానీ ఒక్క ప్రొద్దుటూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతా మాత్రం ఎక్కడా ఆమె పరిధిలోని ఆర్ఎంపీ క్లినిక్ ల పై తనిఖీలు నిర్వహించడం కానీ,చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు అన్నారు.దీనిని బట్టి చూస్తే నిబంధనలు ఆర్ఎంపీ క్లినిక్ లపై ఆమె మమకారం అర్థం అవుతున్నదని అన్నారు.పబ్లిక్ గా ఇంజక్షన్లు వేయడం,ఆక్సిజన్ సిలిండర్ లు ఏర్పాటు చేసుకోవడం,ప్రిస్క్రిప్షన్ లు రాయడం,స్కానింగ్ సెంటర్ల కు రెఫర్ చేయడం వంటివి జరుగుతున్నా ఆమెకు కనిపించడం లేదా కనిపించినా కనిపించనట్టు నటిస్తున్నారా అని ప్రశ్నించారు.ప్రజల ప్రబల కంటే ఆర్ఎంపీ క్లినిక్ నిర్వాహకుల బాగోగులే ముఖ్యమా అన్నారు.అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఎవరు ఏమి నన్ను ప్రశ్నించలేరూ అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు.ఇంచార్జీ డీఎంహెచ్ ఓ వారికి ఫిర్యాదు చేస్తే ఆయన పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదన్నారు.తక్షణమే కలెక్టర్ గారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న ప్రొద్దుటూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతా పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గండి.సునీల్,నగర కార్యదర్శి విజయ్ పాల్గొన్నారు.