తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర కోసం కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ
సలాం ప్రొద్దుటూరు : తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్న చిత్తూరు, అన్నమయ్య, వైయస్‌ఆర్ కడప జిల్లాలోని మామిడి రైతులు. కిలో ధర 4 నుంచి 6 రూపాయలే పలుకుతుండటంతో అన్నదాతలు నష్టాలపాలు అవుతున్నారు.కర్ణాటక తరహాలో ఏపీలోని మామిడి రైతులకు MIS కింద ధరల లోటు చెల్లింపు పథకాన్ని తక్షణమే అమలు చేసి ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసిన వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .