గౌర్ సంచారం… ప్రకృతి సమతుల్యానికి నిత్య నిదర్శనం
–భూమిపుత్ర శ్రీహరి మూర్తి రచయిత,పర్యావరణవేత్త –అడవుల అజేయ మహాశక్తి – భారత అడవి దున్న (గౌర్) సలాం ప్రొద్దుటూరు : ప్రకృతి తన మహోన్నత సృష్టిని ప్రదర్శించాలనుకున్నప్పుడు కొన్ని జీవులను అసాధారణ శక్తి, అపారమైన సహనం, అద్భుతమైన సౌందర్యం, పర్యావరణ సమతుల్యాన్ని నిలబెట్టే బాధ్యతతో ఈ భూమిపై ఆవిష్కరిస్తుంది. పులి అడవికి రాజసాన్ని అందిస్తే, ఏనుగు అడవికి జ్ఞాపకశక్తిని, జ్ఞానాన్ని సూచిస్తుంది. అదే అడవి బలాన్ని, స్థిరత్వాన్ని, జీవవ్యవస్థ అంతర్గత ఆరోగ్యాన్ని ప్రతిబింబించే మహాకాయ జీవి గౌర్ లేదా భారత అడవి...